కాంగ్రెస్ గూటికి ఏపూరి సోమన్న
రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో చేరిక
హైదరాబాద్ – రాష్ట్రంలో నేతల వలసలు ఊపందుకున్నాయి. ప్రధానంగా కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి ఎక్కువగా ఉండడం విశేషం. ప్రముఖ ప్రజా గాయకుడిగా గుర్తింపు పొందిన ఏపూరరి సోమన్న సోమవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఎన్నికల కంటే ముందు ఆయన వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి అధికారంలో ఉన్న కేసీఆర్ ను, ఆయన ఫ్యామిలీని, పార్టీని ఏకి పారేశారు. తన ఆట పాటలతో హోరెత్తించారు. ప్రజలను చైతన్యవంతం చేశారు.
అంతకు ముందు ఇదే ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీలో ప్రజా సాంస్కృతిక విభాగానికి చీఫ్ గా ఉన్నారు. పాటలు కట్టారు, ఎవని పాలైందిరో తెలంగాణ అన్న పాట యావత్ కోట్లాది మందిని ఉర్రూతలూగించేలా చేసింది. కానీ ఆ తర్వాత ఇదే పాట షర్మిల పార్టీలోకి జంప్ అయ్యేలా చేసింది.
ప్రజల కోసం పాటలు పాడాల్సిన కవులు, గాయకులు, కళాకారులు ఇలా పార్టీలు మారిస్తే , కండువాలు కప్పుకుంటే ఎలా అని తెలంగాణ ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మొత్తంగా ఏపూరి సోమన్న జంప్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.