అట్టడుగు వర్గాలకు ఫలాలు అందాలి
అందుకే రిజర్వేషన్లు కావాల్సిందే
న్యూఢిల్లీ – ప్రముఖ సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు పూర్తయినా ఇంకా ఈ దేశంలో అసమానత్వం అనేది ఉందని, ఎన్నో కులాలు, వర్గాలు, ఉప కులాలు , మతాల ప్రాతిపదికన విడి పోయి ఉన్నాయని పేర్కొన్నారు.
శనివారం ప్రముఖ జర్నలిస్ట్ రవీష్ కుమార్ తో జరిగిన చర్చలో యోగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాల్సిందేనని భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
దేశంలో కోట్లాది మంది ప్రజలు ఇంకా అట్టడుగున ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు యోగేంద్ర యాదవ్. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక రకంగా సామాజిక న్యాయం వైపు దిశగా బలోపేతం చేసేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇలాంటి తీర్పు కోసం దశాబ్దాలుగా నిమ్న వర్గాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. అత్యంత వెనుకబడిన దళితులు, గిరిజనులకు ప్రత్యేక కోటాను సృష్టించగలరా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం కాక తప్పదన్నారు. ఎందుకంటే వారు కూడా అత్యధికంగా ఉన్నారని, దానిని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.