ఎన్డీయేకు అంత సీన్ లేదు
యోగేంద్ర యాదవ్ కామెంట్స్
న్యూఢిల్లీ – ప్రముఖ సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆశించిన మేర సీట్లు రావని బాంబు పేల్చారు.
విచిత్రం ఏమిటంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజపీ పరివారమంతా గంప గుత్తగా గత ఏడాది నుంచి ఒకటే నినాదం జపిస్తున్నారు. దానినే ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే 400 సీట్లకు పైగా తమకు వస్తాయని ప్రకటించారు మోదీ.
దీనిపై తీవ్రంగా స్పందించారు యోగేంద్ర యాదవ్. ఏం చేశారని, దేశాన్ని ఏం ఉద్దరించారని అన్ని వస్తాయని ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రభుత్వ రంగ సంస్థలను బడా బాబులకు దారదత్తం చేసిన పీఎంకు అంత సీన్ లేదన్నారు.
బీజేపీ కూటమికి 260 కంటే తక్కువగా వస్తాయని జోష్యం చెప్పారు. ప్రజలు మేల్కొన్నారని , మోదీ దేశానికి చేసిన మోసం గురించి గ్రహించారని పేర్కొన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు.