హిందువుల ఆందోళన యోగి ఆవేదన
రక్షణ కల్పిస్తామన్న యూపీ సీఎం
ఉత్తర ప్రదేశ్ – బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యా నాథ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
బంగ్లాదేశ్‌లో 90% మంది హిందువులు దళిత వర్గానికి చెందిన వారని పేర్కొన్నారు. వారి భద్రత గురించి ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు సీఎం. ఇదేనా మీ లౌకిక వాదం అంటూ మండిపడ్డారు.
దళిత హిందువుల పీడనకు వ్యతిరేకంగా ప్రతికూల శక్తులు తమ ఓటు బ్యాంకును పోగొట్టుకుంటాయనే ఆందోళనతో గొంతు ఎత్తడం లేదని యోగి ఆదిత్యా నాథ్ ఆరోపించారు.
దౌర్జన్యాలు జరిగినా ప్రతిపక్షాలు ఓటు బ్యాంకునే చూస్తున్నాయంటూ మండిపడ్డారు. కానీ బంగ్లాదేశ్ హిందువులకు అవసరమైన సమయంలో వారికి అండగా నిలవడం తమ ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు సీఎం.
ఇప్పటికైనా ఇండియా కూటమి నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేంద్రంలోని తమ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ లో నివసిస్తున్న హిందువులపై ఏ ఒక్కరు దాడికి పాల్పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు యోగి.