Tuesday, April 22, 2025
HomeNEWSఅసెంబ్లీలో స్కిల్స్ యూనివ‌ర్శిటీ బిల్లు

అసెంబ్లీలో స్కిల్స్ యూనివ‌ర్శిటీ బిల్లు

ప‌బ్లిక్..ప్ర‌భుత్వ ఒప్పందం మేర‌కే ప్లాన్

హైద‌రాబాద్ – తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ ముందు నుంచీ యువ‌తీ యువ‌కుల‌కు మెరుగైన విద్యా, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే ఉద్దేశంతో ప్ర‌స్తుత సాంకేతిక‌తో ముందుకు వెళ్లేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్శిటీని తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే ఈ యూనివ‌ర్శిటీ గురించి చెబుతూ వ‌చ్చారు.

గ‌చ్చి బౌలిలో ఈ స్కిల్స్ యూనివ‌ర్శిటీని ఏర్పాటు చేసేందుకు స్థ‌లాన్ని కూడా ప‌రిశీలించారు. దీనికి సంబంధించి త్వ‌రిత‌గ‌తిన నిర్మాణం ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచంతో పోటీ ప‌డేలా దీనిని త‌యారు చేయాల‌ని సూచించారు.

ఇదిలా ఉండ‌గా గురువారం జ‌రిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ స‌ర్కార్ ప్ర‌తిపాదించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్శిటీ ఏర్పాటుకు సంబంధించి బిల్లును ప్ర‌వేశ పెట్టారు ఐటీ , ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు.

దీనిని పూర్తిగా ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో న‌డుస్తుంద‌ని తెలిపారు. ఇందులో పెట్టుబ‌డి పెట్టేందుకు అదానీ లాజిస్టిక్స్, O9 సొల్యూషన్స్, రెడ్డి ల్యాబ్స్, నాక్ , రాయ్ , ఎస్బీఐ , త‌దిత‌ర సంస్థ‌లు భాగ‌స్వామిగా ఉన్నాయ‌ని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments