ఏపీలో యూట్యూబ్ అకాడెమీకి ఓకే
గ్లోబల్ సీఈవోతో చర్చలు జరిపాం
అమరావతి – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రముఖ సామాజిక దిగ్గజ సంస్థ గూగుల్ కు చెందిన యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చర్చలు జరపడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు ఏపీలో యూట్యూబ్ అకాడెమీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారని పేర్కొన్నారు. అటు వైపు నుంచి కూడా సానుకూలంగా స్పందన వచ్చిందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
ఆన్ లైన్ ద్వారా గ్లోబల్ సిఈవోతో చర్చించానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర రాజధాని అమరావతిలో మీడియాకు సంబంధించి సిటీని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సీఎం. ఇప్పటికే ముందస్తు ప్లాన్ చేశామని, ఆ మేరకు యూట్యూబ్ గ్లోబల్ సిఇఓ నీల్ మోహన్ తో చర్చించానని వెల్లడించారు.
సీఎం, గ్లోబల్ సిఇవోతో జరిగిన చర్చల్లో గూగుల్ ఏపీ ఏసీ హెడ్ సంజయ్ గుప్తా కూడా పాల్గొన్నట్లు తెలిపారు. ఈ ముగ్గురి చర్చల్లో ప్రధానంగా ఏపీలో యూట్యూబ్ అకాడెమీకి మొగ్గు చూపినట్లు సమాచారం. ఇందుకు కావాల్సిన సహాయ సహకారాలు తాము అందజేస్తామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.