Sunday, April 6, 2025
HomeENTERTAINMENTయూట్యూబర్ లోకల్ బాయ్ నానికి రిమాండ్

యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి రిమాండ్

మార్చి 7 వ‌ర‌కు రిమాండ్ విధించిన కోర్టు

విశాఖ‌ప‌ట్నం – బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్స్ చేసిన కేసుకు సంబంధించి యూట్యూబ‌ర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వ‌ర‌కు రిమాండ్ విధించింది. తన కార‌ణంగా న‌ష్ట పోయానంటూ బాధితుడు కుమార్ రెడ్డి అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశాడు. 111(2) చీటింగ్, 112(1)పెట్టీ కేసు, 318(4) ఎలక్ట్రానిక్ పోర్జరీ, 319(2) పర్సనల్ చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66 C, 66D, AP గేమింగ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈనెల 21న యూట్యూబ‌ర్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండ‌గా బెట్టింగ్ యాప్స్ ను ప్ర‌మోష‌న్ చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని, త‌ను దీనిని విర‌మించు కోవాల‌ని కోరుతూ సీరియ‌స్ కామెంట్స్ చేశారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్. మిగతా యూట్యూబ‌ర్ల‌ను కూడా హెచ్చ‌రించారు. మీరు చేసే ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌నుల వ‌ల్ల మీరు ప్రాణాలు కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొన్నారు.

మీకు జీవితాన్ని ఇచ్చిన పేరెంట్స్ కు భారం కావ‌ద్ద‌ని కోరారు. అంతే కాదు ఇలాంటి ఫీట్స్ చేయ‌డం వ‌ల్ల స‌మాజంపై దుష్ప్ర‌భావం నెల‌కొంటుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు వీసీ సజ్జ‌నార్.

RELATED ARTICLES

Most Popular

Recent Comments