యూట్యూబ్ లో కీలక మార్పులు
స్పష్టం చేసిన గూగుల్ సంస్థ
అమెరికా – ప్రముఖ ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన టెక్ సంస్థ గూగుల్ సంచలన ప్రకటన చేసింది. ప్రతి రోజూ కోట్లాది మంది తమ సంస్థకు చెందిన యూట్యూబ్ ను వీక్షిస్తారు. మరికొందరు తమకు చెందిన వీడియోలను అప్ లోడ్ చేస్తుంటారు. ఈ సందర్బంగా ఈ మధ్యన యూట్యూబ్ ను అసాంఘిక కార్యకలాపాలకు, రెచ్చగొట్టేలా వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు గ్రహించింది గూగుల్.
దీంతో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది గూగుల్. ఇందులో భాగంగా రాబోయే నెలల్లో యూట్యూబ్ కు సంబంధించి గూగుల్ భారతదేశంలో కఠినమైన చర్యలను ప్రారంభించనుంది. ముఖ్యమైన సందర్భాలలో సమయానుకూలమైన, ఖచ్చితమైన సమాచారాన్ని పొందడానికి ప్రజలు తరచుగా ప్లాట్‌ఫారమ్‌పై ఆధార పడతారని స్పష్టం చేసింది గూగుల్.
బ్రేకింగ్ న్యూస్ లేదా ప్రస్తుత ఈవెంట్‌లతో కూడిన ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుందని గూగుల్ గ్రహించింది. వీక్షకులకు విశ్వసనీయమైన అనుభవాన్నిఅందించడానికి కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
శీర్షికలు లేదా థంబ్‌నెయిల్‌లు తప్పుదారి పట్టించే వీడియోలకు వ్యతిరేకంగా అమలును పెంచాలని YouTube యోచిస్తోంది .