యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్
14 రోజుల రిమాండ్ విధించిన హైకోర్టు
హైదరాబాద్ – పెళ్లి వారమండి ఫేమ్ ప్రసాద్ బెహరాను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ వెబ్ సీరీస్ నటి ఫిర్యాదు చేసింది. లైంగికంగా వేధిస్తున్నాడని, షూటింగ్ సెషన్ లో తనను అనుచితంగా తాకరాని చోట తాకాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో బెహరాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. విచారణ కొనసాగుతోందన్నారు.
ఈనెల 11న మధ్యాహ్నం షూటింగ్ సందర్బంగా తనను వెనకాల అసభ్యంగా తాకాడని ఆరోపించింది నటి. ఇదేమని ప్రశ్నించిన తనను అసభ్యకరంగా, చెప్పరాని రీతిలో తనను దూషించాడని వాపోయింది. ఎంతగా నచ్చ చెప్పినా వినిపించు కోలేదని, చివరకు తన నోటి దూలతో తాను భయపడాల్సి వచ్చిందని తెలిపింది.
తనను కావాలని పదే పదే లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ వచ్చాడని ఫిర్యాదు చేసింది. జూబ్లీ హిల్స్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పర్చగా జడ్జి రిమాండ్ విధించింది. తను మెకానిక్, పెళ్లి వారమండి, పెళ్లికాని ప్రసాద్ తదితర వెబ్ సీరీస్ లలో నటించిన బెహరాకు మంచి ఆదరణ లభించింది.