యూట్యూబర్ షణ్ముక్ అరెస్ట్
గంజాయితో పట్టుబడిన సోదరుడు
హైదరాబాద్ – ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాపులర్ అయ్యాడు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో ఆనాటి నుంచి జల్లెడ పడుతున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.
ఊహించని రీతిలో షణ్ముక్ నివాసంలో సోదాలు చేపట్టారు. ఖాకీలు ఖంగుతిన్నారు. యూట్యూబర్ ఇంట్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. ఓ కేసులో విచారణ కోసం వెళ్లిన వీరికి బిగ్ షాక్ తగిలింది. ఆరు రోజుల్లోనే పెళ్లి..అంత లోనే మరో యువతితో వివాహం చేసుకోవడం విస్తు పోయేలా చేసింది.
ఇదిలా ఉండగా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసింది బాధితురాలు మౌనిక. ఈ సంపత్ వినయ్ ఎవరో కాదు బిగ్ బాస్ ఫేమ్ షణ్ముక్ సోదరుడు. సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కు వెళ్లారు పోలీసులు. గంజాయి లభ్యం చెందడంతో సోదరులను ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.