తండ్రికి తనయుడు నివాళి
కడప జిల్లా – దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ యెదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి వర్దంతి ఇవాళ. ఈ సందర్బంగా సోమవారం కడప జిల్లాలోని ఇడుపుల పాయలో వైఎస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు వైసీపీ బాస్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిలా రెడ్డితో పాటు నేతలు, ప్రజా ప్రతినిధులు , అభిమానులు .
ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. అనుకోకుండా వైఎస్సార్ దుర్మరణం పాలయ్యారు. 8 జూలై 1949లో పుట్టిన రాజశేఖర్ రెడ్డి 2 సెప్టెంబర్ 2009లో ఈ లోకాన్ని వీడారు. మడమ తిప్పని నేతగా గుర్తింపు పొందారు. జనం హృదయాలలో చెరగని ముద్ర వేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అంతా వైఎస్సార్ అని పిలుచుకుంటారు. 2004 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి14వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వైఎస్సార్ (1989, 1991, 1996, 1998) నాలుగు సార్లు కడప నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
1978, 1983, 1985, 1999, 2004 , 2009 లలో పులివెందుల నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆరు పర్యాయాలు శాసన సభ్యుడిగా గెలుపొందారు వైఎస్సార్. 2003లో వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర చరిత్రాత్మకంగా నిలిచి పోయింది. 11 జిల్లాల్లో 60 రోజులలో 1500 కిలోమీటర్లు నడిచారు. పార్టీని విజయ పథంలో నడిపించాడు. ఆ తదనంతరం తనయుడు జగన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.