NEWSANDHRA PRADESH

చెల్లెమ్మ‌ను దీవించండి – జ‌గ‌న్

Share it with your family & friends

న‌గ‌రి బ‌హిరంగ స‌భ‌లో కామెంట్

చిత్తూరు జిల్లా – వైసీపీ బాస్ , ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా న‌గ‌రి శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన ఆర్కే రోజా సెల్వ‌మ‌ణికి మ‌ద్ద‌తుగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు.

ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి త‌న‌కు సోద‌రి కంటే ఎక్కువ అని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. తాము తీసుకు వ‌చ్చిన వాలంటీర్ వ్య‌వ‌స్థ దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా నిలిచింద‌ని, కానీ చంద్ర‌బాబు , ప‌వ‌న్ క‌ళ్యాణ్, పురందేశ్వ‌రి దానిని విమ‌ర్శించేందుకే ప్ర‌య‌త్నం చేశారంటూ మండిప‌డ్డారు.

తాము ఎవ‌రిపైనా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం లేద‌న్నారు. కేవ‌లం సంక్షేమం, అభివృద్దిని ఆధారంగా చేసుకుని ఓట్లు వేయ‌మ‌ని అడుగుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. మీ విలువైన ఓటును చెల్లెమ్మ రోజాకు వేయాల‌ని, ఆమెను నిండు మ‌న‌సుతో ఆశీర్వ‌దించాల‌ని కోరారు.