NEWSANDHRA PRADESH

స‌ర్కార్ పై యుద్దం వైసీపీ స‌న్న‌ద్ధం

Share it with your family & friends

డిసెంబ‌ర్ 11 నుంచి ముహూర్తం

అమ‌రావ‌తి – వైఎస్సార్సీపీ ఏపీ స‌ర్కార్ పై యుద్దం ప్ర‌క‌టించింది. బుధ‌వారం వైసీపీ బాస్, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ఆయా జిల్లాల అధ్య‌క్షులు, కోఆర్డినేట‌ర్లు, ప్ర‌ధాన బాధ్యులు హాజ‌రయ్యారు.

ఏపీ స‌ర్కార్ ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డం లేద‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్ రెడ్డి. ఇక నుంచి ప్ర‌జల త‌ర‌పున గొంతు వినిపించాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మించాల‌ని అన్నారు. ఇందులో భాగంగా డిసెంబ‌ర్ 11న రైతుల త‌ర‌పున వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ర్యాలీలు చేప‌ట్టాల‌ని సూచించారు. అంతే కాకుండా అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు విన‌తిప‌త్ర‌లు అంద‌జేయాల‌ని ఆదేశించారు.

అంతే కాకుండా కరెంట్ ఛార్జీల బాదుడే బాదుడుపై డిసెంబరు 27న ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి.. పెంచిన ఛార్జీలను తగ్గించమని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎస్‌ఈ, సీఎండీ కార్యాలయాల్లో వినతిపత్రం అంద జేయాల‌ని దిశా నిర్దేశం చేశారు జ‌గ‌న్ రెడ్డి.

జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌ కార్యాలయాలకు వెళ్లి విన‌తి ప‌త్రాలు ఇవ్వాల‌న్నారు. ఇక నుంచి ప్ర‌జల మ‌ధ్య‌నే ఉంటూ ముందుకు వెళ్లాల‌న్నారు.