వైసీపీలో పలు పదవుల భర్తీ
ప్రకటించిన మాజీ సీఎం జగన్
అమరావతి – పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ బాస్ వైస్ జగన్ రెడ్డి. పదవుల భర్తీలో భాగంగా అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు . శనివారం పార్టీ సీఎం ఆదేశాల మేరకు వెల్లడించింది.
మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను జగన్ రెడ్డి నియమించారు. వైయస్ఆర్ సీపీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి బాధ్యతలు అప్పగించగా రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డిని నియమించారు.
రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజుకు అప్పగించగా మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్‌బాషా , పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి, మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్, వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్ కు బాధ్యతలు అప్పగించారు జగన్ రెడ్డి.
రాష్ట్ర వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతం రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్ రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష, ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోచం రెడ్డి సునీల్ , వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్ రాజు ను నియమించారు.
రాష్ట్ర గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణ మూర్తి , వైయస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలు.. రామచంద్రారెడ్డి (ప్రైవేట్ స్కూళ్లు)ని చంద్రశేఖర్‌రెడ్డి (గవర్నమెంట్ స్కూళ్లు)కు , అంగన్ వాడీ విభాగం చీఫ్ గా చిన్నమ్మను నియమించారు.