అక్రమ కేసులు బనాయిస్తే ఎలా..?
వైఎస్సార్సీపీ బాస్ వైఎస్ జగన్ రెడ్డి
అమరావతి – ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్సార్సీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. తమ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని, వేధింపులకు గురి చేయడం తగదని అన్నారు .
ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అధికార పార్టీ మెప్పు కోసం పోలీసులు పని చేయొద్దని సూచించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తెలుసు కోవాలని స్పష్టం చేశారు. విధులు నిర్వహించేందుకు తాము అభ్యంతరం చెప్పమని , కానీ అకారణంగా ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేస్తే ఎలా అని ప్రశ్నించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వ్యక్తిగత కక్షలతో దాడులు చేయడం , కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి అని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ బాస్.