NEWSANDHRA PRADESH

దాడులు దారుణం జ‌గ‌న్ ఆగ్ర‌హం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ ముఖ్య‌మంత్రి

అమ‌రావ‌తి – ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. రాష్ట్రంలో కూట‌మి పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాదన్నారు.

త‌మ కార్య‌క‌ర్త‌ను వినుకొండ‌లో టీడీపీకి చెందిన జిలానీ అంద‌రూ చూస్తూ ఉండ‌గానే నరికి చంప‌డం దారుణ‌మ‌న్నారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జాస్వామ్యంలో వీటికి తావు లేద‌న్నారు. ప‌బ్లిక్ గా న‌రికి చంపుతుంటే పోలీసులు ఎక్క‌డికి వెళ్లార‌ని ప్ర‌శ్నించారు. ఇది పూర్తిగా లా అండ్ ఆర్డ‌ర్ వైఫ‌ల్య‌మేన‌ని ఆరోపించారు వైఎస్ జ‌గ‌న్ రెడ్డి.

ఈ ఘ‌ట‌న జ‌రిగి 24 గంట‌లు కాక ముందే త‌మ పార్టీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై దాడుల‌కు దిగ‌డం దారుణ‌మ‌న్నారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల్సిన బాధ్య‌త సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై ఉంద‌న్నారు వైఎస్ జ‌గ‌న్ రెడ్డి.

ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌ని అనుకుంటున్నారా లేక దాడులు చేస్తూ పోతే చూస్తూ ఊరుకుంటున్నారా అని ప్ర‌శ్నించారు. పీఎం మోడీ జోక్యం చేసుకోవాల‌ని జ‌గ‌న్ రెడ్డి కోరారు.