వైసీపీ పార్టీ ప్రక్షాళనపై జగన్ ఫోకస్
పలువురికి కీలక పదవుల అప్పగింత
అమరావతి – వైఎస్సార్సీపీ బాస్ , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాక పోయినా పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఓ వైపు తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ టీడీపీ దాడులకు పాల్పడుతున్నా, కేసులు నమోదు చేస్తున్నా ఎక్కడా తగ్గడం లేదు. ఈ సందర్బంగా ప్రజలలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.
ఇందులో భాగంగా పార్టీలో ప్రక్షాళన ప్రారంభించారు. పార్టీకి సంబంధించిన సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు జగన్ మోహన్ రెడ్డి. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా (సమన్వయకర్తలు) మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డిని నియమించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు.
అనుబంధ విభాగాలకు కూడా నియమకాలు చేపట్టారు మాజీ సీఎం. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెలయే జక్కంపూడి రాజా, బీసీ సెల్ చీఫ్ గా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను నియమించారు.
పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం చీఫ్ గా పానుగంటి చైతన్యను నియమించారు. వీరితో పాటు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వర్ రావు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసన సభ నియోకవర్గ ఇంఛార్జ్ గా పేరాడ తిలక్ ను నియమించారు జగన్ మోహన్ రెడ్డి.