NEWSANDHRA PRADESH

ఏపీలో రెడ్ బుక్ పాల‌న – జ‌గ‌న్ రెడ్డి

Share it with your family & friends

కూట‌మి ప్ర‌భుత్వంపై మాజీ సీఎం ఫైర్

అమ‌రావ‌తి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆయ‌న టీడీపీ చేతిలో దాడుల‌కు గురైన త‌మ పార్టీకి చెందిన బాధితుడిని ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాల‌న సాగిస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఆయ‌న ప‌రోక్షంగా ఈ కామెంట్ చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి అన్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశార‌ని, ప్ర‌తి ఒక్క‌రినీ ఇబ్బందుల‌కు గురి చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

ఊళ్ల‌ల్లో ఆధిప‌త్యం కోసం వ్య‌వ‌స్థ‌ల‌ను భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని ఆవేద‌న చెందారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు మాజీ సీఎం. దాడులు, దారుణాలు, హ‌త్య‌లు, అత్యాచారాల‌కు కేరాఫ్ గా ఏపీ మారి పోయింద‌ని ఆరోపించారు జ‌గ‌న్ రెడ్డి.

కేవ‌లం వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను టార్గెట్ చేశార‌ని , ఆ దిశ‌గా త‌మ ప్లాన్ అమ‌లు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని హెచ్చ‌రించారు.