రియాక్టర్ పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
క్షతగాత్రులకు సాయం చేయాలని విన్నపం
అమరావతి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు . బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డారని సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన ఏపీ కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం జరగకుండా చూడాలని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జగన్ రెడ్డి సూచించారు. ఘటన జరగడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి .
ఇదిలా ఉండగా ఘటనపై ఆరా తీశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్షత గాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిపై తనకు తెలియ చేయాలని స్పష్టం చేశారు.