ప్రతి ఇంట్లో నాన్నతో పాటు నా ఫోటో ఉండాలి
సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్ రెడ్డి
అమరావతి – వైఎస్సార్సీపీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి పండుగ సందర్బంగా రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు డబ్బుల మీద ఆశ లేదన్నారు. తరాలకు సరిపడా డబ్బులను సంపాదించానని అన్నారు. చంద్రబాబు నాయుడు లాగా తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు జగన్ రెడ్డి.
తనకు ఉన్నది ఒకే ఒక్క ఆశ అని , అది ఏమిటంటే తాను చనిపోయాక కూడా జనం గుండెల్లో బతకాలని అన్నారు. ఇది మాత్రమే తాను కోరుకున్నానని, అందుకే రాజకీయాలలో కొనసాగుతున్నానని చెప్పారు మాజీ సీఎం.
బతికినన్నాళ్లు సాధ్యమైనంత మేరకు ప్రజలకు మేలు చేకూర్చే పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. ప్రతి ఇంట్లో దివంగత తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు తన ఫోటో కూడా ఉండాలని , అదే తన కోరిక అని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి.
ఇదే నా అంతిమ కల, కోరిక కూడా అని ప్రకటించారు . దాని కోసమే తాను రాజకీయాలలో కొనసాగుతున్నట్లు ప్రకటించారు.