గ్రీటింగ్స్ తెలిపిన మాజీ సీఎం జగన్
అమరావతి – మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సరం సందర్బంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు సంతోషంగా, ఆయురారోగ్యంతో ఉండాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని తెలిపారు . ప్రతి ఇల్లు సుఖ శాంతులతో వెల్లి విరియాలని అన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలషించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము పోరాటం చేస్తామని, కూటమి సర్కార్ గతి తప్పకుండా వాచ్ డాగ్ లాగా ఉంటామన్నారు. ఈ ఏడాది ప్రజల గొంతుకై వినిపిస్తామని ప్రకటించారు. తాను ప్రజల వద్దకు వెళతామని , వారి సమస్యలను దగ్గరుండి వింటానని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి.
ఆచరణకు నోచుకోని హామలను ఇచ్చి కోట్లాది ప్రజలను మోసం చేసిన ఘనత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. దేశంలోనే అత్యధిక సంపన్నమైన సీఎంగా నిలవడం, రూ. 931 ఆస్తులను సంపాదించడం పట్ల స్పందించారు. ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.