కోనేరు హంపి గెలుపు స్పూర్తి దాయకం
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి కోనేరు హంపిని ప్రశంసలతో ముంచెత్తారు. చెస్ రాపిడ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలవడం ఏపీకి గర్వ కారణమని పేర్కొన్నారు. ఈ అపూర్వ విజయం యావత్ జాతికి ఎనలేని గర్వాన్ని తెచ్చి పెట్టిందన్నారు. ప్రపంచ వేదికపై హంపీ సాధించిన విజయం అచంచలమైన అంకితభావం, చదరంగం పట్ల మక్కువను ప్రతిబింబిస్తుందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌లోని యువ ప్రతిభావంతులకు, ముఖ్యంగా బాలికలకు, క్రీడలు, ఇతర విషయాలలో రాణించేందుకు కృషి చేయడానికి ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
హంపీ నిరంతర కృషి, నిబద్ధతతో ప్రపంచ అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా స్థానం లభించిందని కొనియాడారు. ఆమె సాధించిన విజయాలు వ్యక్తిగత ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రతిభను ఉత్పత్తి చేసే ఆంధ్రప్రదేశ్ వారసత్వాన్ని కూడా బల పరుస్తున్నాయని హైలైట్ చేశారు.
హంపీ కోనేరు ఈ అసాధారణ విజయాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. ఆమె సంకల్పం, శ్రేష్ఠత మనందరికీ గర్వ కారణంగా నిలుస్తుందన్నారు. ఆమె భవిష్యత్ ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.