NEWSANDHRA PRADESH

మ‌హోన్న‌త మాన‌వ‌తా మూర్తి మ‌ద‌ర్ థెరీసా

Share it with your family & friends


ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – స‌మాజ సేవే దైవంగా భావించి కోట్లాది మందిని ప్ర‌భావితం చేసిన మ‌హోన్న‌త మాన‌వ‌తా మూర్తి మ‌ద‌ర్ థెరీసా అని కొనియాడారు ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. సోమ‌వారం మ‌ద‌ర్ థెరీసా జ‌యంతి . ఈ సంద‌ర్బంగా విజ‌య‌వాడ న‌గ‌రంలోని నిర్మ‌ల్ హృద‌య్ భ‌వ‌న్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.

అనంత‌రం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు జ‌గ‌న్ మోహన్ రెడ్డి. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే త‌న ఆస్తిగా భావించి వారంద‌రినీ అక్కున చేర్చుకున్న మ‌హ‌నీయురాలు మ‌ద‌ర్ థెరీసా అని కొనియాడారు.

ఎంతో మంది అనాథ‌లు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే కాదు అనాథ, పేద పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పించి వారి భ‌విషత్తుకు బంగారు బాట‌లు వేసిన మహోన్నత వ్యక్తి అని ప్ర‌శంసించారు మాజీ ముఖ్య‌మంత్రి.

మన ప్రభుత్వ హయాంలో విజ‌య‌వాడ న‌గ‌రంలోని నిర్మల్‌ హృదయ్ ‌భవన్‌ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వారికి సహాయ సహకారాలు అందించామ‌ని గుర్తు చేశారు. ఈ సంద‌ర్బంగా ఇవాళ మ‌ద‌ర్ థెరీసా జ‌యంతి రోజున తాను కాంప్లెక్స్ భ‌వనాన్ని ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

మ‌ద‌ర్ థెరీసాకు మ‌న‌స్పూర్తిగా నివాళులు అర్పిస్తున్నాన‌ని అన్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.