NEWSANDHRA PRADESH

బాబు బండారం బ‌ట్ట‌బ‌య‌లు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన వైఎస్ జ‌గ‌న్ రెడ్డి

తాడేప‌ల్లిగూడెం – ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తిరుప‌తి ల‌డ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ప్ర‌త్యేక విచార‌ణ‌కు ఆదేశించ‌డం ప‌ట్ల స్పందించారు. ఈ నిర్ణ‌యంతో చంద్ర‌బాబు , ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న రాజ‌కీయ బండారం ఏమిటో బ‌య‌ట ప‌డింద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

చంద్రబాబు నిజ స్వరూపాన్ని ఎత్తి చూపారని పేర్కొన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా రెచ్చ గొడుతున్నాడనేది సుప్రీంకోర్టు గట్టి వ్యాఖ్యలు చేసిందన్నారు. దేవుణ్ని రాజకీయాల్లోకి లాగొద్దు అని సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింద‌ని, చంద్రబాబు స్వయంగా వేసుకున్న ‘సిట్‌’ను కూడా రద్దు చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు.

తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసి, లడ్డూలో జంతువుల కొవ్వు వాడినట్లు, దాన్ని భక్తులకు ఇచ్చినట్లు, భక్తులు ఆ ప్రసాదం స్వీకరించినట్లు చేసిన ప్రచారం దారుణం అన్నారు వైఎస్ జ‌గ‌న్ రెడ్డి.

చంద్రబాబు సీఎం అయ్యాక తను నియమించుకున్న టీటీడీ ఈఓ సీఎం ప్రకటనలకు విరుద్ధంగా స్వయంగా ప్రకటనలు చేశాడని చెప్పారు. చంద్రబాబు మామూలుగా మంచి వ్యక్తి అయితే, ఇంత ఆధారాలు కనిపిస్తుంటే, కొంతైనా సిగ్గు పడతాడు. తన మాటలకు వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు, దేవుడంటే భయం, భక్తి ఉన్న వారెవరైనా పశ్చాత్తాప పడతారు. ప్రజలకు క్షమాపణ చెబుతారని అన్నారు. చంద్రబాబుకు పశ్చాత్తాపం ఉండదు. దేవుడంటే భక్తి, భయం ఉండదన్నారు జ‌గ‌న్ రెడ్డి.
.
‘ధర్మారెడ్డి నాకు బావ అంట. కరుణాకర్‌రెడ్డి నాకు మామ అంట. మనిషి అన్నాక కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి’. అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ సీఎం. సుప్రీంకోర్టు నిజానికి చంద్రబాబుకు అక్షింతలు వేస్తే, దాన్ని ఆరోజు నేషనల్‌ మీడియా మొత్తం రాసిన విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

నిజానికి సుప్రీంకోర్టు చంద్రబాబును తిడితే, దాన్నీ వక్రీకరిస్తూ.. మా పాపం పండింది. వైవీ సుబ్బారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అని రాశారని ఆరోపించారు.