Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHరైత‌న్న‌ల పోరాటం విజ‌యవంతం

రైత‌న్న‌ల పోరాటం విజ‌యవంతం

స్ప‌ష్టం చేసిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతం అయ్యిందన్నారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. చంద్ర‌బాబు చేస్తున్న మోసాల‌ను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. రైతులకు తోడుగా నిలిచిన వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు. ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి కార్యక్రమం అద్దం పట్టింద‌న్నారు.

దీనిని అడ్డుకోవడానికి చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్‌ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయమ‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

ప్రతిఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20 వేలు ఎందుకు ఇవ్వడం లేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా? ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యంచేసి, ఇ-క్రాప్‌ను గాలికి వదిలేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహించి, ధాన్యం కొనుగోళ్లను మధ్యవర్తులకు, మిల్లర్లకు అప్పగించడం వల్ల ఇవాళ ప్రతి బస్తాకు రూ.300-400లు నష్ట పోతున్నామని రైతులు నిలదీయడం తప్పా? తమకు కనీస మద్దతు ధర ఇవ్వమని అడగడం నేరమా అని ప్ర‌శ్నించారు.

ఉచిత పంటలబీమా పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి తమపై అదనపు భారం వేస్తున్నారని రైతులంతా నిలదీయడం తప్పా? ఈ అంశాలపై కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు అందించకూడదా? తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు ఇది కూడా చేయకూడదని అడ్డుపడ్డం చంద్రబాబు రాక్షస మనస్తత్వానికి నిదర్శనం అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని ధ్వ‌జ‌మెత్తారు.

మరోవైపు నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులతో కలిసి చంద్రబాబు చేస్తున్నవి దుర్మార్గాలు కావా? నో డ్యూ సర్టిఫికెట్లు వీఆర్వోలు గ్రామ సచివాలయాల్లోనే ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వనీయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారంటూ నిల‌దీశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments