Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHచంద్ర‌బాబు విజ‌న్ బ‌క్వాస్ - జ‌గ‌న్

చంద్ర‌బాబు విజ‌న్ బ‌క్వాస్ – జ‌గ‌న్

ఆయ‌న చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే

తాడేప‌ల్లిగూడెం – మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు ప‌దే ప‌దే విజ‌న్ గురించి మాట్లాడుతున్నార‌ని, అదంతా బోగ‌స్ అంటూ ఎద్దేవా చేశారు. అనంత‌పురం జిల్లా పార్టీకి చెందిన నేత‌ల‌తో స‌మావేశమ‌య్యారు. అది విజ‌న్ కాద‌ని 420 అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. విజ‌న్ పేరుతో రంగురంగుల క‌థ‌లు అల్లుతున్నాడ‌ని, ప్ర‌జ‌లను మోసం చేసేందుకు మ‌రో ప్లాన్ వేశాడంటూ ఫైర్ అయ్యారు. బాబుకు అంత సీన్ లేద‌న్నారు.

మేనిఫెస్టోను ఎగ్గొట్టే ప్రణాళికది అంటూ ఫైర్ అయ్యారు జ‌గ‌న్ రెడ్డి. ఏడు నెలల క్రితం హామీలకే దిక్కు లేదన్నారు. విద్యా రంగానికి ఊపిరి పోశామ‌న్నారు. హార్వర్డ్, ఎంఐటీ వంటి అత్యుత్తుమ సంస్థలను భాగ‌స్వామ్యం చేసిన ఘ‌న‌త మ‌న‌కే ద‌క్కుతుంద‌న్నారు.

వైద్యం లోనూ సమూల మార్పులు తీసుకు వ‌చ్చామ‌ని, గ్రామ స్ధాయిలో ప్రివెంటివ్‌ కేర్ తీసుకు వ‌చ్చామ‌న్నారు జ‌గ‌న్ రెడ్డి. రైతుల కోసం గొప్ప సంస్కరణలు తీసుకు వ‌చ్చామ‌ని, దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఆర్బీకే సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసి రైతుల‌కు చేయూత ఇచ్చామ‌ని చెప్పారు.

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం హామీల అమ‌లులో వైఫ‌ల్యం చెందింద‌ని, పోరు బాట‌కు సిద్దం కావాల‌ని పిలుపునిచ్చారు వైసీపీ శ్రేణుల‌కు. ప్ర‌తి చోటా మ‌రోసారి మ‌న జెండా ఎగ‌రాల‌ని అన్నారు. ప్ర‌తి కార్య‌క‌ర్త సోష‌ల్ మీడియా వారియ‌ర్ కావాల‌ని పిలుపునిచ్చారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments