NEWSANDHRA PRADESH

స‌ర్కార్ నిర్వాకం జ‌గ‌న్ ఆగ్ర‌హం

Share it with your family & friends

ముంద‌స్తు హెచ్చ‌రించినా స్పందించ లేదు

విజ‌య‌వాడ – ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం , వాతావ‌ర‌ణ శాఖ ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేసింద‌ని, భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింద‌ని అయినా టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు .

వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల‌ను జ‌గ‌న్ రెడ్డి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా బాధితుల‌తో మాట్లాడారు. 11 ల‌క్ష‌ల 30 వేల క్యూసెక్కుల వ‌ర‌ద ఇప్పుడు కొత్తేమీ కాదన్నారు.

1903లో 11 ల‌క్ష‌ల 90వేల క్యూసెక్కులు రాగా,.. 2009లో 11 ల‌క్ష‌ల 10 వేల క్యూసెక్కుల వ‌ర‌ద వ‌చ్చిందని తెలిపారు జ‌గ‌న్ రెడ్డి. త‌మ హ‌యాంలో 11 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద వ‌చ్చినా..ఎప్పుడూ ఇలాంటి ప‌రిస్థితులు జ‌ర‌గ లేద‌న్నారు. ముందు నుంచే చ‌ర్య‌లు తీసుకుని ఉండి ఉంటే ఇటువంటి ప‌రిస్థితులు త‌లెత్తి ఉండేవి కావ‌న్నారు మాజీ సీఎం.

పాల‌న‌పై దృష్టి పెట్ట‌కుండా క‌క్ష సాధింపుల‌పై ధ్యాస పెట్ట‌డం వ‌ల‌న ఇలాంటి ప‌రిస్థితులు ఏర్పాడ్డాయ‌ని మండిప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా వ‌ర‌ద బాధిత స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలంతా పని చేస్తున్నారని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులూ పాల్గొంటున్నారని తెలిపారు. వాళ్లు చేయగలిగినంత సాయం చేస్తార‌ని పేర్కొన్నారు మాజీ సీఎం.