24న ఢిల్లీలో వైసీపీ ధర్నా
ప్రకటించిన మాజీ సీఎం
అమరావతి – రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వినుకొండలో దారుణ హత్యకు గురైన ముస్లిం కుటుంబాన్ని పరామర్శించారు. భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
రోజు రోజుకు బతికే పరిస్థితులు లేకుండా పోయాయని ఆవేదన చెందారు జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ క్షీణించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు లేఖలు రాశానని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈనెల 24న బుధవారం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు మాజీ సీఎం. చంద్రబాబు నాయుడు హయాంలో అధికారంలోకి వచ్చిన 45 రోజులలో ఏపీ రాష్ట్రం హత్యాంధ్రప్రదేశ్ గా మారిందని సంచలన ఆరోపణలు చేశారు జగన్ మోహన్ రెడ్డి.