NEWSANDHRA PRADESH

ఏపీ స‌ర్కార్ సూప‌ర్ సిక్స్ బ‌క్వాస్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన వైఎస్ జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు.
ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన ఆరు హామీలు అమ‌లులో పూర్తిగా వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు. హామీలు అమ‌లు చేయ‌లేకనే బ‌డ్జెట్ ను ఆల‌స్యం చేశార‌ని నిప్పులు చెరిగారు.

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలంటూ మండిపడ్డారు. ఆయ‌న ఎప్ప‌టికీ మార‌రంటూ ఆరోపించారు. 2018-19 నాటికి ప్రభుత్వం చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు అని ధ్వ‌జ‌మెత్తారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

వాస్తవాలు ఏమిటో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయని భ‌గ్గుమ‌న్నారు… కాగ్‌ రిపోర్టుపై కూడా తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. కాగ్‌ రిపోర్ట్‌ కూడా రూ.6 లక్షల 46 వేల కోట్లు అప్పు అని చెప్పిందన్నారు.

రూ. 11 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని అప్పుపై చంద్రబాబు అసత్యాలు చెప్పడం ధర్మమేనా అని ప్ర‌శ్నించారు. బీజేపీలో కూడా టీడీపీకి చెందిన మనుషులే ఉన్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.
చంద్రబాబు హయాంలో వార్శిక అప్పుల వృద్ధి రేటు 19.54 శాతంగా ఉంద‌న్నారు.