దాడులు దారుణం జగన్ ఆగ్రహం
గూండాల రాజ్యం నడుస్తోందని ఫైర్
అమరావతి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. గూండాల రాజ్యం కొనసాగుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో తమ పార్టీని లేకుండా చేయాలని అనుకుంటున్నారని, అది జరగని పని అన్నారు జగన్ రెడ్డి.
కూటమి ప్రభుత్వం కొలువు తీరి 90 రోజులు కాకుండానే హత్యలు, దాడులు, దారుణాలు, అత్యాచారాలు, కేసులు పెరిగి పోయాయని వాపోయారు. ప్రశ్నించే వారిని నామ రూపాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు మాజీ సీఎం.
ప్రధానంగా ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పిందని అన్నారు. రక్షించాల్సిన పోలీసులు లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడంలో పూర్తిగా వైఫల్యం అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ రెడ్డి.
గూండాలు హత్యలకు పాల్పడుతున్నారని. పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందన్నారు. హత్యలు చేసినవారికే కాదు, చేయించినవారినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.