NEWSANDHRA PRADESH

ప్ర‌చార ఆర్భాటం చంద్ర‌బాబు ఆరాటం

Share it with your family & friends

ఎద్దేవా చేసిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. శ్వేత ప‌త్రాల పేరుతో కాల యాప‌న చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇదంతా కేవ‌లం త‌న ప్ర‌చారం కోసం త‌ప్ప ప్ర‌జ‌ల కోసం కాద‌న్నారు. బ‌హిరంగ చ‌ర్చ‌కు తాము సిద్దంగా ఉన్నామ‌ని, మ‌రి ప్ర‌భుత్వం సిద్దంగా ఉందా అంటూ ప్ర‌శ్నించారు జ‌గ‌న్ రెడ్డి.

లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. తాము అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకు వ‌చ్చామ‌ని చెప్పారు. ఏమైనా అవినీతి, అక్ర‌మాలు ఉంటే నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు జ‌గ‌న్ రెడ్డి.

చంద్ర‌బాబు నాయుడు కావాల‌ని గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ తో 10 ల‌క్ష‌ల కోట్లు అప్పు ఉంద‌ని చెప్పించారంటూ ఆరోపించారు. త‌మ స‌ర్కార్ కోల్పోయే నాటికి ఏపీ ప్ర‌భుత్వ అప్పు కేవ‌లం రూ. 5.18 ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ రెడ్డి.

మొత్తం అప్పు రూ. 7.48 ల‌క్ష‌ల కోట్లు ఉండ‌గా రూ. 14 ల‌క్ష‌ల కోట్లు ఉందంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేశారంటూ మండిప‌డ్డారు. ఇది ధ‌ర్మ‌మేనా అని నిల‌దీశారు . కేంద్ర ఆర్థిక స‌ర్వే త‌మ ప్ర‌భుత్వ ప‌నితీరును మెచ్చుకుంద‌ని, ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని మండిప‌డ్డారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.