శ్రీశ్రీశ్రీ భక్త కనకదాస సామాజిక తత్వవేత్త
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – సామాజిక తత్వవేత్త శ్రీశ్రీశ్రీ గురు కనకదాస అని కొనియాడారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కురుబ గౌడ దాస కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడిగా, ఆధునిక కవిగా, సంగీతకారుడిగా, స్వరకర్తగా శ్రీ భక్త కనకదాస గుర్తింపు పొందారని అన్నారు. సోమవారం ఆయన జయంతి సందర్బంగా దాస చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యత , సమత్వం పెంపొందిస్తూ శ్రీశ్రీశ్రీ గురు కనకదాస ఎన్నో కీర్తనలు పాడారని, ఆయన ఆచరించిన మార్గం సదా స్మరణీయమని పేర్కొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
సంఘ సంస్కర్త, కవి గాయకుడు, కృష్ణ తత్వ భక్త అగ్రగణ్యుడు శ్రీశ్రీశ్రీ గురు కనకదాస అని కొనియాడారు మాజీ సీఎం. సమాజంలో మార్పు తీసుకు వచ్చేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.
కర్ణాటకలో జన్మించిన శ్రీశ్రీశ్రీ గురు కనకదాస రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త అని పేర్కొన్నారు.
బీసీలను, వారి సాంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ, వారి ఉన్నతి కోసం ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేసిన మహనీయుడు ఆయన అని అన్నారు.