కూటమి సునామి జగన్ విక్టరీ
59 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు
అమరావతి – ఏపీలో చంద్రబాబు నాయుడు కూటమి దెబ్బకు ఫ్యాన్ కూలి పోయింది. 175 స్థానాలకు గాను వైసీపీ కేవలం 13 సీట్లకు మాత్రమే పరిమితమైంది. వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. ఆయన పులివెందులలో బరిలో నిలిచారు. ఆయన 59 వేల ఓట్ల మెజారిటీ సాధించారు.
ఇదిలా ఉండగా వైసీపీకి చెందిన కీలక నేతలు, మంత్రులంతా ఓటమి బాట పట్టారు. వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా సెల్వమణి, అంబటి రాంబాబు , తదితర ప్రముఖులంతా పరాజయం పొందడం విస్తు పోయేలా చేసింది.
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత జగన్ రెడ్డికి దక్కినా ఎందుకని ప్రజలు ఆదరించ లేదని ఆలోచనలో పడ్డారు జగన్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా ఓడించారు ఏపీ రాష్ట్ర ప్రజలు. ఇది ఒక రకంగా బిగ్ షాక్ అని చెప్పక తప్పదు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ఇప్పుడు స్వయంగా జగన్ కు తెలిసి వచ్చింది.