NEWSANDHRA PRADESH

నా మ‌తం మాన‌వ‌త్వం – వైఎస్ జ‌గ‌న్

Share it with your family & friends

చంద్ర‌బాబు మ‌తం రాజ‌కీయం చేయ‌డం

విజ‌య‌వాడ – వైసీపీ బాస్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న మ‌తం ఏమిటి అనే దానిపై జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర దించే ప్ర‌య‌త్నం చేశారు. శుక్ర‌వారం ఆయ‌న తాడేప‌ల్లిగూడెంలో మీడియాతో మాట్లాడారు. తిరుమ‌ల‌ను ద‌ర్శించు కునేందుకు రూల్స్ విధించ‌డం దారుణ‌మ‌న్నారు.

తిరుమ‌ల‌ను కావాల‌ని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయం చేస్తున్నారంటూ ఆరోపించారు. త‌న మ‌తం ఏమిటి అనే దానిపై క్లారిటీ ఇచ్చారు జ‌గ‌న్ రెడ్డి. త‌న మ‌తం మాన‌వ‌త్వం అని స్పష్టం చేశారు. త‌న‌కు రాజ‌కీయాలు చేయ‌డం తెలియ‌ద‌న్నారు. త‌న‌కు తెలిసింద‌ల్లా ఒక్క‌టేన‌ని, అది ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించ‌డ‌మేన‌ని పేర్కొన్నారు.

కులాల పేరుతో, మ‌తాల పేరుతో చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్న చంద్ర‌బాబు నాయుడుకు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే త‌మ పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను కావాల‌ని ఇబ్బందుల‌కు గురి చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చి భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశార‌ని ఆరోపించారు. అయినా తాను తిరుమ‌ల‌కు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆల‌య సంద‌ర్శ‌న‌కు వెళ్ల‌కుండా నిరోధించే హ‌క్కు ఏపీ స‌ర్కార్ కు, చంద్ర‌బాబుకు లేద‌న్నారు. గ‌తంలో చాలా సార్లు తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నాన‌ని, ఏనాడూ డిక్ల‌రేష‌న్ అడ‌గ‌లేద‌న్నారు. ఇప్పుడే ఎందుకు దానిని తెర మీద‌కు తెస్తున్నారంటూ ప్ర‌శ్నించారు జ‌గ‌న్ రెడ్డి.