NEWSANDHRA PRADESH

నేనున్నా మీ వెంటే ఉంటా – జ‌గ‌న్

Share it with your family & friends

నేత‌లు..కార్య‌క‌ర్త‌లు అధైర్య ప‌డ‌వ‌ద్దు

అమ‌రావ‌తి – ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆదివారం సైతం ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి చేప‌ట్టారు. పులివెందుల లోని భాక‌రాపురంలో ఉన్న క్యాంపు ఆఫీసులో కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు, నేత‌లు అభిమానుల‌తో ఆయ‌న మ‌మేకం అయ్యేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

ఆయ‌న అంద‌రినీ పేరు పేరునా ప‌ల‌క‌రించారు. వారి బాగోగుల గురించి ఆరా తీశారు. వారికి ఉన్న ఇబ్బందులు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు.

కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని పార్టీ చీఫ్ భరోసానిచ్చారు.