దాడులు చేయిస్తున్న చంద్రబాబు
సంచలన ఆరోపణలు చేసిన జగన్
అమరావతి – ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఆయనే కావాలని తమ పార్టీ వారిని టార్గెట్ చేశాడని ఆరోపించారు. దీనిని ఎంత మాత్రం సహించే ప్రసక్తి లేదని అన్నారు.
శనివారం టీడీపీ చేతిలో గాయపడి కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేతను జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయనకు భరోసా ఇచ్చారు. ఇక నుంచి ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. తాను ఉన్నానని, మీ అందరిని కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.
బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. బాధితుడిని పరామర్శించిన అనంతరం జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి కాకుండానే దాడులకు తెర తీశారని ధ్వజమెత్తారు. ఇదేనా ప్రజా పాలన అంటే అని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడే దాడులు చేయాలని ప్రోత్సహిస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అధికారం ఉంది కదా అని పేట్రేగి పోతే బాగుండదన్నారు.