ప్రకటించిన మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి
కడప జిల్లా – మాజీ సీఎం జగన్ పులివెందులలో పర్యటించారు. రూ. 10 కోట్లతో వైఎస్ రాజా రెడ్డి నేత్ర వైద్య శాల ఆధునీకరణ చేపట్టారు. దీనిని ప్రారంభించిన సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ఈ నేత్రాలయాన్ని ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆప్పత్రిని పరిశీలించారు. వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు. తను కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. గత దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోందని అన్నారు జగన్.
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆస్పత్రిలో లోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. అయితే..ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు జగన్ రెడ్డి.
ఈ వైద్యశాలకు వైఎస్సార్ ఫౌండేషన్ స్ధలం సమకూర్చడంతో పాటు సుమారు రూ. 10 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించి, అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. ప్రముఖ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ఆస్పత్రిని అధునికీకరించడం విశేషం.
తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది. రోజుకు 5 వేల ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచారు.