బాబు లడ్డూ రాజకీయం దారుణం – జగన్
చిల్లర ఆరోపణలు బంద్ చేస్తే బెటర్
అమరావతి – శ్రీవారి లడ్డూ కల్తీ జరిగేందుకు ఎలాంటి ఆస్కారం లేదని స్పష్టం చేశారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కావాలని తిరుమలను రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.
నియమ నిబంధనల మేరకే అన్నింటిని కొనుగోలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు జగన్ రెడ్డి.
.నెయ్యి తెచ్చే ప్రతి ట్యాంకర్ ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు మాజీ సీఎం. ప్రతి ట్యాంకు శాంపిళ్లను మూడుసార్లు పరీక్ష చేపడతారని చెప్పారు .
మొత్తంగా చేపట్టిన మూడు టెస్టులు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ లోపలికి అనుమతి ఇస్తుందని తెలిపారు జగన్ మోహన్ రెడ్డి.
అయితే చంద్రబాబు నాయుడు జరగనిది జరిగినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. జులై 12న శాంపిల్స్ తీసుకున్నారని, .. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని గుర్తు చేశారు. జులై 17న ఎన్డీడీబికి నెయ్యి శాంపిల్స్ పంపించారని తెలిపారు. ఆ నివేదికను జూలై 23న అందజేసిందని, మరి ఇప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడుతున్నాడో జనానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు జగన్ రెడ్డి.