డబ్బులు తీసుకోండి ఓటు నాకేయండి
పిలుపునిచ్చిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – ఏపీ సీఎం జగన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. ఇప్పటికే 40 ఏళ్ల రాజకీయంలో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించాడని , ఎలాగైనా గెలిచేందుకు ఒక్కో ఓటుకు రూ. 2 వేల నుండి రూ. 4 వేల దాకా ఇస్తాడని అన్నారు. ఇచ్చిన డబ్బులను కాదనకుండా తీసుకోండి..కానీ ఓటు మాత్రం నాకు వేయాలని కోరారు వైఎస్ జగన్ రెడ్డి.
ఏపీని సర్వ నాశనం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆరోపించారు. కూటమి పేరుతో కొత్త నాటకానికి తెర తీశాడని, ఆయన కంటున్న కలలు కల్లలు కావడం ఖాయమని జోష్యం చెప్పారు జగన్ రెడ్డి. వై నాట్ 175 అన్నది తమ నినాదమని, పక్కా వస్తాయని చెప్పారు సీఎం.
ప్రజలు సమర్థవంతమైన పాలనతో పాటు సుస్థిరమైన నాయకత్వం కూడా కోరుకుంటున్నారని ఈ రెండింటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి.
వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కేవలం తన సామాజిక వర్గానికి మేలు చేకూరుస్తూ వచ్చిన చరిత్ర చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు.