కేసులు పెట్టినా భయ పడొద్దు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన చంద్రబాబు కూటమి సర్కార్ పాలన ఆరంభంలోనే వేధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ప్రలోభాలకు గురి చేస్తాడని ఆరోపించారు. ఎవరూ కూడా భయపడ వద్దని భరోసా ఇచ్చారు. మనపై కేసులు పెట్టినా భయ పడవద్దని సూచించారు. రాష్ట్రంలో 40 శాతానికి పైగా ప్రజలు మన వైపే ఉన్నారని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నారని , కానీ ఏం జరిగిందనేది ఇంకా తెలియడం లేదన్నారు జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు శుకుని పాచికల మాదిరి ఉన్నాయని వాపోయారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎన్నికల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు మాజీ సీఎం.