మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలి పెట్టనంటూ హెచ్చరించారు. విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. ఈసారి ప్రజల్లోకి వస్తానని, ఎవరు ఏం చేస్తారో చూస్తానన్నారు. కూటమి సర్కార్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కార్యకర్తల కోసం తాను ఎలా పని చేస్తానో ప్రత్యక్షంగా చూపిస్తానని అన్నారు. ప్రజల కోసం పాటు పడ్డానని..మిమ్మల్ని పట్టించు కోలేక పోయానని వాపోయారు.
ప్రజా సమస్యలపై పోరాడుతానని, కూటమి సర్కార్ ను నిలదీస్తానని ప్రకటించారు. ఇక చూస్తూ ఊరుకోలేనని అన్నారు. ఇన్నాళ్ల పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ , మంత్రి వర్గానికి సమయం ఇచ్చానని కానీ వారు దానిని వినియోగించు కోలేక పోయారని అన్నారు.
ఆరు హామీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించారని, ఉచిత ఫ్రీ బస్సు ఏమైందంటూ ప్రశ్నించారు. అబద్దాలు చెప్పడంలో, తిమ్మిని బమ్మి చేయడంలో, చేసింది గోరంత అయితే దానిని కొండంతగా చెప్పుకోవడం చంద్రబాబు నాయుడుకు అలవాటేనంటూ సంచలన కామెంట్స్ చేశారు జగన్ రెడ్డి.