గవర్నర్ కు లేఖ రాసిన జగన్ రెడ్డి
రూ. 10 లక్షల కోట్ల అప్పు అబద్దం
అమరావతి – ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. ఈ సందర్బంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేత పత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో అన్నీ తప్పులే ఉన్నాయని, అదంతా అబద్దం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తాము ప్రభుత్వం కోల్పోయే నాటికి రాష్ట్ర అప్పు కేవలం రూ. 7 లక్షల కోట్లు మాత్రమే ఉందని , కానీ చంద్రబాబు నాయుడు కావాలని తనను బద్నాం చేసేందుకని రూ. 10 లక్షల కోట్లు అప్పు ఉందంటూ చెప్పడం దారుణమన్నారు.
కూటమి సర్కార్ అబద్దాలను బడ్జెట్ ప్రసంగంలో చేర్చిందని, దీని గురించి అభ్యంతరం చెప్పాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందని ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రధానంగా కొన్ని అంశాలను వక్రీకరించిందిని , వాస్తవాలను తొక్కి పెట్టిందని ఆరోపించారు.
ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.