NEWSANDHRA PRADESH

వైఎస్సార్ కు జ‌గ‌న్ నివాళి

Share it with your family & friends

నీ జ్ఞాప‌కం ప‌దిలమ‌న్న కొడుకు

అమ‌రావ‌తి – కడ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లో సోమ‌వారం 75వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఘ‌నంగా నివాళులు అర్పించారు. త‌న‌తో పాటు త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి , సోద‌రి వైఎస్ ష‌ర్మిలా రెడ్డి తండ్రి స‌మాధి వ‌ద్ద‌కు చేరుకుని పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్బంగా త‌న తండ్రి , మ‌హా నాయ‌కుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గురించి త‌న అనుభూతుల‌ను పంచుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణం విషాదం. కానీ ఆయ‌న జీవితం మాత్రం కోట్లాది మందికి నిత్యం స్పూర్తిని క‌లిగిస్తూనే ఉంద‌ని పేర్కొన్నారు.

వైఎస్సార్ లాంటి నేత మ‌ళ్లీ ఈ భూమి మీద పుట్ట‌బోడంటూ పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న జ‌యంతి రోజు. ఇది కోట్లాది మందికి పండుగ రోజు అంటూ కొనియాడారు. మిమ్మ‌ల్ని స్మ‌రించు కోవ‌డం మా పూర్వ జ‌న్మ సుకృతం అంటూ తెలిపారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.