ఇక నుంచి జనంతో ములాఖత్ – జగన్
జనవరి మూడో వారం నుంచి పర్యటన
అమరావతి – వైసీపీ చీఫ్ , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టీడీపి కూటమి సర్కార్ పై యుద్దం ప్రకటించారు. హామీలను అమలు పర్చడంలో విఫలమైందని ఆరోపించారు. జనవరి మూడో వారం నుంచి జిల్లాలలో పర్యటిస్తానని ప్రకటించారు జగన్ రె్డి.
ప్రతి పార్లమెంట్ పరిధిలో బుధ, గురువారం నిద్ర చేస్తానని చెప్పారు.. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మమేకం అవుతానని తెలిపారు.. వైసీపీ కేడర్ ప్రజలోకి సగర్వంగా వెళ్లవచ్చని అన్నారు.. కూటమి నేతలు అసత్య హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు మాజీ సీఎం.
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని, ఇక రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇవ్వడం ఖాయమని జోష్యం చెప్పారు. ఉన్న వ్యవస్థలను అన్నింటిని నిర్వీర్యం చేసేందుకు యత్నించడం దారుణమన్నారు జగన్ రెడ్డి. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక నుంచి ప్రత్యక్షంగా యుద్దం చేయడం జరుగుతుందన్నారు.