చంద్రబాబు ఓ కొండ చిలువ
ఏపీ సీఎం జగన్ రెడ్డి కామెంట్
పశ్చిమ గోదావరి జిల్లా – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రసంగించారు. బాబు మామూలోడు కాదన్నారు. ఆయన అనకొండను మించిన డేంజర్ అని పేర్కొన్నారు.
విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడును జగన్ మోహన్ రెడ్డి కొండ చిలువతో పోల్చారు. ఇక ఎండను ఏ మాత్రం లెక్క చేయకుండా సభకు వచ్చినందుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు జగన్ రెడ్డి .
మరో పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగ బోతోందన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు అన్నారు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని కోరారు ఏపీ సీఎం.
ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు అమలవతాయని, అదే బాబు కూటమికి ఓటు వేస్తే బంద్ అవుతాయని హెచ్చరించారు.