NEWSANDHRA PRADESH

ప్ర‌త్యేక హోదాపై తొలి సంత‌కం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

తిరుప‌తి – కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే తొలి సంత‌కం ఏపీ రాష్ట్రానికి సంబంధించి ప్ర‌త్యేక హోదాపై తొలి సంత‌కం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. తిరుప‌తి తార‌క రామ మైదానంలో శుక్ర‌వారం ఏపీ పీసీసీ ప్ర‌త్యేక హోదా సాధాన స‌భ‌ను నిర్వ‌హించారు. భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

గ‌త 10 ఏళ్లుగా ఏపీని పాలించిన టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు కానీ ప్ర‌స్తుతం సీఎంగా కొలువు తీరిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కానీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో మౌనంగా ఎందుకు ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. ఇద్ద‌రూ క‌లిసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చారంటూ ధ్వ‌జ‌మెత్తారు . ప్ర‌త్యేక హోదా అన్న‌ది ఆంధ్రుల హ‌క్కు అని స్ప‌ష్టం చేశారు.

హోదా ఇస్తాన‌న్న ప్ర‌ధాన మంత్రి మోడీ పంగ‌నామాలు పెట్టాడంటూ ధ్వ‌జ‌మెత్తారు. మోడీ ఒక కేడీ అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. హోదా అడిగితే త‌ల్లిని చంపి బిడ్డ‌ను వేరు చేశాడ‌ని సొల్లు క‌బుర్లు చెప్పాడ‌ని , నిజానికి త‌ల్లి లాంటి ఆంధ్రాను చంపింది మోడీనేనంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్‌.