NEWSANDHRA PRADESH

విభ‌జ‌న హామీల కోసం పోరాడుదాం

Share it with your family & friends

జ‌గ‌న్..బాబు..ప‌వ‌న్ కు ష‌ర్మిల పిలుపు

అమ‌రావ‌తి – ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ రాజ‌కీయాల‌ను మ‌రింత వేడిని పుట్టిస్తున్నారంటూ మండిప‌డ్డారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. బుధ‌వారం ఆమె లేఖ రాశారు. వాటిని అన్ని పార్టీల నేత‌ల‌కు పంపించారు. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోయ‌డం అల‌వాటుగా మారింద‌ని, దానిని త‌గ్గించుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

ఏపీ విభ‌జ‌న జ‌రిగి 10 ఏళ్ల‌వుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, పురందేశ్వ‌రి మౌనంగా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. ఇక‌నైనా చిల్ల‌ర రాజ‌కీయాలు మానేసి రాష్ట్ర అభివృద్దికి సంబంధించి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుందో ఆలోచించాల‌ని పేర్కొన్నారు వైఎస్ ష‌ర్మిల.

ఏపీ విభ‌జ‌న హామీల అమ‌లు 5.5 కోట్ల ప్ర‌జానీకం ప్రాథ‌మిక హ‌క్కు అని స్ప‌ష్టం చేశారు. ఇది కూడా తెలియ‌కుండా ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటామంటే ఊరుకునే ప్ర‌స‌క్తి లేదన్నారు. విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయ‌కుండా తాత్సారం చేస్తున్న కేంద్ర స‌ర్కార్ పై యుద్దం చేసేందుకు త‌న‌తో క‌లిసి రావాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ , పురంధేశ్వ‌రిని ఆహ్వానించారు.