వైఎస్ షర్మిల ఆస్తులు రూ. 182 కోట్లు
జగన్ రెడ్డికి రూ. 82.5 కోట్లు బకాయిలు
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ , కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి తన ఆస్తులను ప్రకటించారు. ఆమె ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. తను సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 182 కోట్లు ఉందని స్పష్టం చేశారు.
విచిత్రం ఏమిటంటే తన సోదరుడు, వైసీపీ బాస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తను రూ. 82.5 కోట్లు బకాయి పడ్డానని తెలిపారు. అంతే కాకుండా తన వదిన, జగన్ రెడ్డి భార్య భారతీ రెడ్డికి రూ. 19.5 లక్షలు బాకీ ఉన్నానని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
వీరితో పాటు భర్త అనిల్ కుమార్ , తల్లి వైఎస్ విజయమ్మకు రూ. 40 లక్షలు, రూ. 30 కోట్లు బాకీ ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కడప నుంచి ఆమె ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి.
తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయడంలో కీలక పాత్ర పోషించారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల. ఇక్కడ పోటీ మరింత రసవత్తరంగా మారే ఛాన్స్ ఉంది.