రాహుల్ వెరీ వెరీ స్పెషల్
కలకాలం సంతోషంగా ఉండాలి
అమరావతి – ఏఐసీసీ మాజీ చీఫ్, రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ పుట్టిన రోజు ఇవాళ. ఆయనకు ఇవాల్టితో 54 ఏళ్లు. ఈ సందర్బంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బర్త్ డే విషెస్ తెలిపారు రాహుల్ గాంధీకి.
ప్రజా నాయకుడిగా రాహుల్ గాంధీ రోజు రోజుకు జనాదరణ పొందుతున్నారని పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలను, యువతీ యువకులను ప్రభావితం చేస్తున్నారని కొనియాడారు. ఇవాళ దేశంలో బలమైన ప్రధాని మోడీని, బీజేపీ సర్కార్ ను ఢీకొనడంలో రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం గొప్పదన్నారు.
ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎప్పటికీ నిలిచి పోతుందని పేర్కొన్నారు. దేశం కోసం ఆయన పడుతున్న తపన, అంకిత భావం గొప్పదన్నారు వైఎస్ షర్మిల. మీ నాయకత్వం ఉజ్వలమైన , సంపన్నమైన భవిష్యత్తు కలిగించేలా చేస్తుందని పేర్కొన్నారు.
ప్రతి ఏటా పుట్టిన రోజు జరుపు కోవాలని, మీరు చల్లంగా ఉండాలని షర్మిల కోరారు.