NEWSANDHRA PRADESH

బ‌ద్వేల్ నుంచి ష‌ర్మిల బ‌స్సు యాత్ర

Share it with your family & friends

నేటి నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారం షురూ

అమ‌రావ‌తి – ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఏప్రిల్ 5 శుక్ర‌వారం నుంచి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్ప‌టికే ఆమె ఎన్నిక‌ల రంగంలోకి దిగారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో శాస‌న స‌భ‌తో పాటు లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే జాబితాల‌ను కూడా ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డ్డారు.

క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ నుంచి బ‌స్సు యాత్ర ను చేప‌ట్టున్నారు. ఈ యాత్ర‌కు ఏపీ న్యాయ యాత్ర అని పేరు పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం ఎస్కేఏఎన్ మండ‌లం అమ‌గంప‌ల్లి వ‌ద్ద ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభించ‌నున్నారు.

బ‌స్సు యాత్ర‌లో భాగంగా ఇటుకుల పాడు , స‌విషెట్టిప‌ల్లి, వ‌ర‌కుంట‌ల్ , బాల‌య్య ప‌ల్లి, న‌ర్సాపురం, గుంట‌వారి ప‌ల్లి, కాల‌స‌పాడు, మ‌హానందిప‌ల్లి , మామిళ్ల‌ప‌ల్లి, లింగారెడ్డిప‌ల్లి, పోరు మామిళ్ల‌, పాయ‌ల‌కుంట్ల‌, బ‌ద్వేల్ టౌన్ , అట్లూరు మీదుగా ఈ బ‌స్సు యాత్ర కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ పీసీసీ చీఫ్‌.

ఈ కార్య‌క్ర‌మానికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు త‌ర‌లి రావాల‌ని పిలుపునిచ్చారు.